పవన్ సరసన నటించబోయే భామ ఎవరు.?

pawan_kalyan
చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేటి నుంచి కెమెరా ముందుకు రానుంది. ఆయన నటించనున్న ‘సర్దార్’ సినిమా సెకండ్ షెడ్యూల్ నేటి నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షురూ చేయనున్న ఈ సినిమా షూట్ ఇక గ్యాప్ లేకుండా కంటిన్యూగా జరగనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి పోటీని ఇచ్చే విలన్ ని కూడా ఫైనలైజ్ చేసి తన మీద కొన్ని సీన్స్ కూడా షూట్ చేసారు. అతనే మరాఠీ నటుడు శరత్ కేల్కర్. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఈ సినిమాలో పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు.

ప్రస్తుతం ఈ చిత్ర టీం పవన్ కి పర్ఫెక్ట్ కోడీ కోసం పలువురుని పరిశీలిస్తున్నారు. వారిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయిన సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లు ఉన్నారు. వీరితో పాటు పలువురు ముంబై భామలను కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చెయ్యలేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని ఓ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. దాంతో తనకి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే అమ్మాయి కోసం చూస్తున్నారు. మై ఈ సినిమాలో పవన్ సరసన జోడీ కట్టే బంపర్ ఆఫర్ ఎవరిని వరిస్తుందనే దాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. పవర్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుంటే, శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version