
టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుల హీరోల్లో యంగ్ హీరో రానా దగ్గుబాటి ఒకరు. రానా నటించిన ‘బాహుబలి’ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. రానా బాహుబలి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న భళ్లాలదేవ పాత్రలో కనిపించాడు. ఈ పాత్రలో రానా చూపిన పెర్ఫార్మన్స్ కి మంచి పేరు వచ్చింది. రానా దగ్గుబాటి ప్రస్తుతం తమిళంలో తెరకేక్క్తుతున్న బెంగుళూరు డేస్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాని పూర్తి చేసి బాహుబలి సెకండ పార్ట్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి వేసిన లేటెస్ట్ ట్వీట్ అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది. రానా తెలుగు తెరకు పరిచయం అయిన సినిమా ‘లీడర్’. అందరూ కమర్షియల్ సినిమాలతో ఎంట్రీ ఇస్తున్న టైంలో రానా మాత్రం ఓ పొలిటికల్ సబ్జెక్ట్ అయిన లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా రానా చెప్పిన సమాచారం ప్రకారం ప్రస్తుతం లీడర్ సినిమా సీక్వెల్ కోసం కథని సిద్దం చేస్తున్నారు. ప్రసతుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని రానా తెలిపాడు. సెప్టెంబర్ నుంచి బాహుబలి 2 షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా షూట్ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.