
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ 5 వారలను పూర్తి చేసుకొని 6వ వారంలోకి అడుగు పెట్టింది. 6వ వారం వీకెండ్ లోనూ అదే జోరు కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా ఏ భాష అనే విషయంతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా సంచలనాలు సృష్టిస్తూ, ఆరవ వారాంతం కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా టాప్లో నిలిచింది. తెలుగు, హిందీల్లో ఇప్పటికే వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా తమిళంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా బాహుబలి సినిమా 6వ వారం వీకెండ్ లో సూపర్బ్ కలెక్షన్స్ ని సాధించింది. ప్రధానంగా కోలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇస్తూ టాప్ 3 లో ‘బాహుబలి’ నిలవడం విశేషం. ఈ వారం తమిళంలో శింబు నటించిన ‘వాలు’, ఆర్య నటించిన ‘వాసు శరవణన్ ఒంనా పడిచ్చవంగా’ సినిమాలు మొదటి రెండు స్థానాలను భర్తీ చేస్తే, మూడవ స్థానాన్ని బాహుబలి కైవసం చేసుకుంది. అంతే కాకుండా ఓ ప్రముఖ టీవీ ఛానల్ బాహుబలి తమిళ శాటిలైట్ రైట్స్ ని సుమారు 8 కోట్లకి కొనుక్కోవడం విశేషం. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.