దర్శకుడు విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘కర’. ఈ నెల 30న తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఎంపిక గురించి విఘ్నేశ్ రాజా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ‘కర’లో ఫిమేల్ లీడ్‌గా తొలుత చైత్ర జె. ఆచార్‌ను ఎంపిక చేశాం. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమెను ఈ సినిమాలో తీసుకోలేదు. ఆ తర్వాత మమితా బైజును సంప్రదించాను’ అని విఘ్నేశ్ రాజా చెప్పుకొచ్చారు.
విఘ్నేశ్ రాజా ఇంకా మాట్లాడుతూ.. ‘మమితా ఇప్పటి వరకూ అన్నీ హుషారైన రోల్స్ ప్లే చేసింది. మన సినిమాలోని పాత్ర అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నటించదేమో’ అని కథ చెప్పిన తర్వాత అనుకున్నాను. కానీ, ఆమె నటిస్తానని చెప్పడంతో సర్ ప్రైజ్ అయ్యా. ఇక సెట్స్ లో ఆమె విధానం నిజంగా చాలా బాగుంది. పాత్రను అర్ధం చేసుకుని ఆమె నటించింది’ అని విఘ్నేశ్ రాజా తెలిపారు.
