రీసెంట్ గా బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన మరో కాంట్రవర్సియల్ చిత్రమే “ది కేరళ స్టోరీ 2”. గత కొన్నాళ్ల కితం వచ్చిన మొదటి పార్ట్ కేరళ స్టోరీ 1 బాలీవుడ్ లో అదరగొట్టింది. అయితే లవ్ జిహాద్ అనే సున్నితమైన అంశంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ అయ్యింది.
ఇక పార్ట్ 2 కి మరింత లోతుగా మరో కోణంతో దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్ తెరకెక్కించారు. అయితే ఇది బాక్సాఫీస్ దగ్గర అంత సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమా ఓటిటి డేట్ ని ప్రముఖ సంస్థ జీ 5 అనౌన్స్ చేశారు. మే 8గా మొదట వారు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ వారు కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు.
ఒక వారం ముందుకు జరిపి మే 1గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది మాత్రం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అదితి భార్య, ఉల్కా గుప్తా అలాగే ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించగా సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ షా నిర్మాణం వహించారు.
