ఓవర్సీస్‌లోనూ భారీ రిలీజ్‌కు సిద్ధమైన ‘కిక్ 2’!

kick-2
కిక్ సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అయిన ‘కిక్ 2’ విడుదవుతుందా అని చూసిన ఎదురుచూపులకు మరో నాలుగు రోజుల్లో తెరపడనుంది. మాస్ మహారాజ్ రవితేజను డిఫరెంట్‌గా పరిచయం చేసి అతడి కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా నిలిచింది ‘కిక్’కు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందిన విషయం తెలిసిందే! ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, చివరకు ఆగష్టు 21కి ఫిక్స్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో సినిమా యూనిట్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ మధ్యే విడుదల చేసిన రెండో ట్రైలర్‌కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాపై అన్నిచోట్లా భారీ అంచనాలే ఉండడంతో సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్‌కు అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోని ఇతర ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు పెద్ద రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూకే, మలేషియా ఇలా తెలుగు సినిమా మార్కెట్ విస్తృతంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version