‘భలే భలే మగాడివోయ్’కి ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ తో కూడా ఓ పెద్ద హిట్ కొట్టచ్చు అని నిరూపించిన డైరెక్టర్ మారుతి. అలా వచ్చిన సినిమాలే ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట. ఈ సినిమాల సక్సెస్ తర్వాత మారుతి టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో నానితో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. యంగ్ హీరో నాని సరసన అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో భలే భలే మగాడివోయ్ ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ కి అందరి నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరి చేత మన్ననలు అందుకుంటోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అందరి ప్రేక్షకులకి బాగా రీచ్ అవ్వడంతో ఈ సినిమాకి క్రేజ్ బాగా పెరిగింది.ఈ సినిమాలో నాని ఓ మతిమరుపు పర్సన్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ లో తను మతిపరుపు వ్యక్తిగా చేసిన పెర్ఫార్మన్స్, కామెడీ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే గోపి సుందర్ అందించిన ఆడియోకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వారు యువి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి చేసిన సినిమా ఇది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version