‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ టైటిల్ సాంగ్ నేడే రిలీజ్.!

subhramanyam-for-sale

మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘రేయ్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ చేసిన 3వ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర రెండవ సారి ఈ సినిమాలో జోడీ కట్టారు. షూటింగ్ మొత్తం ఫినిష్ అయిన ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఆగష్టు 23న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుందని ఇది వరకే తెలియజేశాం.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఆడియో రిలీజ్ కంటే ముందే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి రేడియో మిర్చిలో డైరెక్టర్ హరీష్ శంకర్ – హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అదుఇఒ రిలీజ్ కి ముందు నుంచే ఆడియో పై మరింత హైప్ పెంచడం కోసం ఈ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజునే ఈ సినిమాని కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు.

ఈ మూవీలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన స్పెషల్ ఆడియో రిలీజ్ టీజర్ కి వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్ తో సినిమాపై హైప్ పెరిగింది. పూర్తి కమర్షియల్ హంగులతో రానున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version