
ఒకే మూస ధోరణిలో వస్తున్న కమర్షియల్ సినిమాలకు చెక్ పెడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో సరికొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుట్టాడు. అలా చేసిన సినిమానే ‘శ్రీమంతుడు’. ఈ సినిమాతో తెలుగులో కూడా ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ ని కమర్షియల్ గా చెప్పవచ్చని, అలా చెప్పి పెద్ద హిట్ కూడా కొట్టచ్చని నిరూపించాడు. ‘మనం పుట్టిన ఊరుని మరిచిపోకూడదు, మనతో పాటు ఆ ఊరిని కూడా డెవలప్ చెయ్యాలి, అవసరం అయతే ఆ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చెయ్యాలి’ అనే పాయింట్ ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి చెప్పాడు ఈ చిత్ర డైరెక్టర్ కొరటాల శివ. ఇలాంటి సినిమా చేసినందుకు మహేష్ బాబు – కొరటాల శివలపై ప్రశంశల జల్లు కురుస్తోంది.
మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. మొదటి 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చెయ్యడానికి సిద్దమైంది. వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన శ్రీమంతుడు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కలెక్షన్స్ తోనే 50 కోట్ల మార్క్ ని టచ్ చేయనుంది. మొదటి 12 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో కలుపుకొని 48 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిన శ్రీమంతుడు రెండు వారలలో(14 రోజుల్లో) 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఓవరాల్ గా రెండు వారాల్లో 65 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసేస్తుంది. ఈ విషయాలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంతే కాకుండా 50 కోట్ల క్లబ్ లో 3 సినిమాలు ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు రికార్డ్ సృష్టించాడు.