
రెండు నెలల పాటు రవితేజ అభిమానులను ఎన్నో ఎదురుచూపులకు గురిచేసిన ‘కిక్ 2’ సినిమా, నిన్న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రవి తేజ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలిచిన ఈ సినిమా, ఫస్ట్‌డే కలెక్షన్స్ విషయంలోనూ సత్తా చాటింది. ఇక మొదటిరోజు ఈ సినిమాకు అన్నిచోట్లా మంచి టాక్ వచ్చినా, సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వేగం పెరిగి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపించింది.
ఇక ఈ విషయాన్ని రియలైజ్ అయిన ‘కిక్ 2’ యూనిట్ వెంటనే తగు చర్యలను చేపట్టింది. సుమారు 20 నిమిషాల సన్నివేశాలను ట్రిమ్ చేయనున్నట్లు సమాచారం అందించి. రేపు, ఎల్లుండికల్లా అన్నిచోట్లా ఈ ట్రిమ్ వర్షన్ ప్రదర్శితం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి-రవితేజ కాంబినేషన్లో 2009లో వచ్చిన కిక్ సినిమాకు సీక్వెలే ఈ కిక్ 2. హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా, థమన్ సంగీత దర్శకత్వం వహించారు.