రామ్ చరణ్ మూవీకి ఫైనల్ టైటిల్ ఇదేనా.?

Ram-charan
టాలీవుడ్ మాస్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యాక్షన్ కి కామెడీని కలిపి చెప్పగల శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ మరియు హీరోలకి డూప్ గా కనిపించే పాత్రలో ఆకట్టుకోనున్నాడని ఇది వరకే తెలియజేశాం. రామ్ చరణ్ ఈ సినిమాలో చేయబోయే రిస్కీ స్టంట్స్ కి సాంపుల్ గా రెండు రోజుల క్రితం ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఆ టీజర్ లో రామ్ చరణ్ చేసిన స్టంట్స్, చరణ్ మాస్ అప్పియరెన్స్ సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు బాగా నచ్చేసింది.

షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ తాజాగా ఈ చిత్ర టీం ఫైనల్ గా ఓ టైటిల్ కి ఫిక్స్ అయినట్లు ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్నారు. వారు చెప్పిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమాకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టాలని అనుకుంటున్నారట. ఈ టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యడం కోసం ఈ చిత్ర టీంలోని అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. అందరూ ఈ టైటిల్ వైపే మొగ్గు చూపితే ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తారు. రామ్ చరణ్ ఈ సినిమాలో బ్రూస్ లీకి ఫ్యాన్ గా కనిపించడమే కాకుండా తన కుడి చేయిపై బ్రూస్లీ టాటోతో కనిపిస్తాడు. కావున సినిమాకి ఇది పర్ఫెక్ట్ టైటిల్ ని అనుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఇదే ఫైనలైజ్ చేస్తారా లేక వేరే టైటిల్ వైపు వెళ్తారా అన్నది మరో వారం రోజుల్లో తెలిసిపోతుంది.

రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version