థాయ్‌లాండ్‌లో మహేష్ హాలిడే టైమ్!

Mahesh-Babu
గత మూడు, నాలుగు వారాలుగా ‘శ్రీమంతుడు’ సినిమా కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడేపై వెళ్ళారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహేష్ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా శ్రీమంతుడు నిలిచింది. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథను కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చెప్పిన విధానం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా విడుదలకు వారం ముందు, విడుదల తర్వాత మరో పదిరోజులు మహేష్ స్వయంగా చేపట్టిన ప్రమోషన్స్ సినిమాకు విపరీతంగా కలిసివచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మహేష్ ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ‘శ్రీమంతుడు’ ఆశించిన విధంగానే సినిమా మంచి టాక్‌తో మూడో వారంలోకి అడుగుపెట్టి సూపర్ హిట్ స్టేటస్ కొట్టేసింది. ఇక తమ ప్రయత్నం విజయవంతం కావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మహేష్, సినిమా సక్సెస్‌తో ఫ్రీ అయిపోయారు. రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మహేష్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని కనిపించారు. ఇక ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్ వెళ్ళారు. అక్కడే మరోవారం హాలీడేను ఎంజాయ్ చేశాక తిరిగొచ్చి ‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసం సిద్ధం కానున్నారు.

Exit mobile version