గోపీచంద్ నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్

Gopichand
‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’ ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్. ‘జిల్’ సినిమా తర్వాత గోపీచంద్ తనకి కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెండు నెలల క్రితం ప్రారంభమై అప్పుడే 50% షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండవ షెడ్యూల్ కి సిద్దమవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది ఈ చిత్ర టీం.

డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ తెలిపిన సమాచారం ప్రకారం నవంబర్ కల్లా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు. యాక్షన్ అంశాలతో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసిన ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాలేదు. గోపీచంద్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా కనిపిచనుంది. ‘పిల్లా నువ్వులేని జీవితం’తో హిట్ అందుకున్న ఎఎస్ రవికుమార్ చౌదరి గోపీచంద్ సినిమాకి కూడా ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకోవడానికి ట్రై చేసాడు. వరుస హిట్స్ అందుకున్న గోపీచంద్ – హిట్ అందుకొని ఊపు మీదున్న రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా కోసా ‘యజ్ఞం’ రేంజ్ హిట్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది.

Exit mobile version