
తమిళ పొన్ను అయిన అందాల భామ సమంత మొదటి తమిళ సినిమా ఫ్లాప్ అయినా తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాకుండా ఆ సినిమా తనకి తెలుగులో స్టార్డం తెచ్చిపెట్టి తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అలా కెరీర్ ప్రారంభంలోనే ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, రాజమౌళిల సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యింది. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించిన సమంత తమిల్మలో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ దక్కించుకుంటూ, హిట్స్ అందుకుంటూ చాలా బిజీ బిజీగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్నేషనల్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రస్తుతం నేను గ్లామర్ మరియు కేవలం ఐదు పాటలకి పరిమితం అయిన సినిమాలను ఒప్పుకోవడం లేదు. హీరోయిన్ గా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఒప్పుకుంటున్నాను. నా దర్శకులు కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఒకవేళ అలా జరగని రోజు నేను సినిమాల నుంచి రిటైర్ అవుతాను. నా క్రీర్లో నేను సాధించిన అచీవ్ మెంట్ గురించి చెప్పాలి అంటే నేను పనిచేసిన దర్శకులు, హీరోలతో నాకు మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసే ఆఫర్స్ రావడమే నేను సాధించిన బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా ఫీలవుతానని’ సమంత తెలిపింది.
సమంత తెలుగులో ఇప్పటికే నాగ చైతన్యతో మూడు సినిమాలు చేసింది, మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసిన సమంత త్వరలోనే మూడవ సినిమా కూడా చేయనుంది. అలాగే ఎన్.టి.ఆర్ తో రెండు, సూర్య, ధనుష్ లతో రెండు సినిమాలు చేసింది.