
ప్రస్తుతం అక్కినేని నాగార్జున – యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో తెలుగు – తమిళ భాషల్లో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో తమన్నా మాత్రమే కాకుండా ఓ ముఖ్య పాత్ర కోసం సౌత్ ఆఫ్రికన్ మోడల్ అయిన గాబ్రియేల్ల దిమెత్రియాడెస్ ని ఫైనలైజ్ చేసారని ఇది వరకే తెలియజేశాం. గాబ్రియేల్ల సినిమాలో నాగార్జున పక్కన కనిపించనుంది. ఇటీవలే లండన్ లో వీరిద్దరిపై వచ్చే సన్నివేశాలను షూట్ చేసారు.
అక్కడి నుంచి ఇండియాకి చేరుకున్న ఈ చిత్ర టీం హైదరాబద్ లో మిగిలిన షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రస్తుతం నాగార్జున – గాబ్రియేల్ల మీద వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. ఈ విషయంలో గాబ్రియేల్ల చాలా థ్రిల్లింగ్ గా ఫీలవుతోందని, నాగ్ సరసన నటించే చాన్స్ రావడంతో తను చాలా హ్యాపీ గా ఉందని ఈ చిత్ర టీం అంటోంది. హాయ్ వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్న ఈ సినిమాలో మేజర్ పార్ట్ ని లండన్ లో షూట్ చేసారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఊపిరి’ మరియు ‘దోస్త్’ నే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.