
జూలై 10 2015.. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఇక ఆ రోజు నుంచి మొదలుకొని నేటివరకూ విడుదలైన అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ దూసుకెళుతోందీ సినిమా. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సంచలనాలు నమోదు చేసిన ఈ సినిమా, చెన్నై నగరంలో స్ట్రైట్ తమిళ సినిమాలను కూడా దాటేసి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ఇదిలా ఉంటే గత శుక్రవారంతో ఏడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో యాభై రోజులకు చేరువవుతుంది. ఇక విడుదలై ఏడు వారాలైనా చెన్నై సిటీలో ఇప్పటికీ పలు ప్రధాన మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. ఇప్పటివరకూ 7.92 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించిన ‘ఐ’ తర్వాతి స్థానంలో నిలిచింది. త్వరలోనే ‘బాహుబలి’, ‘ఐ’ రికార్డును కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ టాక్.