
ఈ ఏడాది పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘పటాస్’తో సూపర్ హిట్ అందుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత పటాస్ ఇచ్చిన సక్సెస్ తో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన ‘షేర్’ మూవీ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో నిర్మించిన ‘కిక్ 2’ సినిమా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తను చేస్తున్న ‘షేర్’ సినిమాని ఫినిష్ చేసాక తను చేయబోయే తదుపరి సినిమాకి కూడా రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
గోపీచంద్ తో ‘యజ్ఞం’ సినిమా చేసి రీసెంట్ గా ‘పిల్లా నువ్వులేని జీవితం’తో హిట్ అందుకున్న ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే రవికుమార్ చౌదరి చెప్పిన లైన్ నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడు. రవికుమార్ చౌదరి ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ కల్లా గోపీచంద్ సినిమాని పూర్తి చేసి జనవరి నుంచి ఎస్ఎస్ రవికుమార్ చౌదరి కళ్యాణ్ రామ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఈ లోపు కళ్యాణ్ రామ్ కూడా తనకున్న కమిట్ మెంట్స్ ని ఫినిష్ చేయనున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ని బాగా ప్రెజంట్ చేసే రవికుమార్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ లాంటి మాస్ హీరో సినిమా చేయనుండడం ఆసక్తిని పెంచే విషయం.