
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. దానికి కారణం తన బర్త్ డే కానుకగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అందించిన ‘శ్రీమంతుడు’ సినిమా వారందరినీ మెప్పించడమే కాకుండా వద్ద ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటి వరకూ తెలుగు చలన చరిత్ర చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టులో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. శ్రీమంతుడు రిలీజ్ అయ్యి ఇది మూడవ వారం కానీ ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ మహేష్ బాబులో ఆనందాన్ని పెంచడమే కాకుండా నూతన ఉత్సాహాన్ని నింపింది.
శ్రీమంతుడు సినిమా మహేష్ బాబుకి ఆనందాన్ని మాత్రమే కాదు భారీ ఎత్తున లక్ష్మీ దేవిని కూడా తెచ్చి పెట్టే పనిలో ఉంది. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్ట్ చేసిన షేర్ మార్క్ చూసిన నిర్మాతలు తమ బ్యానర్ లో సినిమా చేయమంటూ మహేష్ బాబుకు భారీ ఆఫర్స్ ఇస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాతలు ఇప్పటి వరకూ మహేష్ బాబు తీసుకునే రెమ్యునరేషన్ ని మించి ఆఫర్ చేస్తుండడం సెన్సేషన్ గా మారింది. స్టార్ హీరో డేట్స్ కోసం నిర్మాతలు ముందే రెమ్యునరేషన్ ఇచ్చేయడం కామన్ గా జరిగే విషయమే, కానీ ఇక్కడ తీసుకునే దానికన్నా ఎక్కువ ఆఫర్ చేస్తుండడం విశేషం. మహేష్ బాబు రెమ్యునరేషన్ పరంగా తొందరపడకుండా కథా పరంగా ఆచి తూచి సినిమాలను ఎంచుకునే పనిలో ఉన్నాడు.
నూతన ఉత్సాహంతో ఉన్న మహేష్ బాబు సెప్టెంబర్ 14 నుంచి తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ని ప్రారంభించనున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.