విక్రమ్-సమంతల సినిమా షూటింగ్ పూర్తి

Samantha-vikram1
తమిళ స్టార్ హీరో విక్రమ్, సమంతలు హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొందుతోన్న క్రేజీ సినిమా ’10 ఎంద్రతుకుల్ల’. పది లెక్కెపెట్టే లోపు అంటూ థ్రిల్లింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఓ ఆసక్తికర రోడ్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో రానుందని తెలుస్తోంది. ‘ఐ’ తర్వాత విక్రమ్ చేస్తోన్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై ఈ స్థాయి అంచనాలు ఉండడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ పలు ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ వెళుతోన్న మురుగదాస్ ఈ సినిమా ద్వారా మరో డిఫరెంట్ కథతో రానున్నారని సమాచారం. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నిన్నటితో పూర్తైంది. రాజస్థాన్‌లో గత కొద్దిరోజులుగా జరిగిన భారీ యాక్షన్ ప్యాక్ క్లైమాక్స్‌తో షూటింగ్ పూర్తైంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని దర్శక నిర్మాతలు తెలిపారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది.

Exit mobile version