యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన లో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ లండన్ లోనే జరుగుతోంది. ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాల్సి ఉండడంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఇప్పటి వరకూ కమిట్ అవ్వలేదు. కొందరేమో కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అని అంటున్నా దానిపై కచ్చితమైన సమాచారం లేదు. అది పక్కన పెడితే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వారు తమ నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో అని అనౌన్స్ చేసారు.
ఇదిలా ఉండగా మరో భారీ ప్రొడక్షన్ హౌస్ కుడా ఎన్.టి.ఆర్ తో ఓ సినిమాని ప్లాన్ చేసింది. అది మరెవరో కాదు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్న పివిపి సినిమాస్ బ్యానర్. ఈ సంస్థకి అధినేత పరమ్ వి పొట్లూరి. ఇప్పటికే ఆయన ఎన్.టి.ఆర్ తో చరచాలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో చేయబోయే సినిమా కోసం కథని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి ఎన్.టి.ఆర్ తదుపరి సినిమా పివిపి బ్యానర్ లో ఉంటుందా లేక ఆ తర్వాతి సినిమా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఎన్.టి.ఆర్ – పివిపి బ్యానర్ అనగానే ఓ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని అభిమానులు ఆశించవచ్చు.
