మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన లవ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ‘డెకాయిట్’. అయితే బాక్సాఫీస్ వద్ద ఒకింత మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకున్నప్పటికీ సినిమా మంచి వసూళ్లు సాధించి దుమ్ము లేపింది.
ఇలా థియేటర్స్ లో మూడు వారాలు పాటుగా మంచి రన్ ని చూసిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది.
ఈ చిత్రాన్ని వారు ఇవాళ్టి నుంచి తెలుగు సహా మలయాళం, కన్నడ, తమిళ్ ఈ 4 భాషల్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరి హిందీ ఆడియెన్స్ కి మాత్రం ఒకింత ఇది డిజప్పాయింట్ చేసే న్యూస్ అని చెప్పొచ్చు. సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
