
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం యూరప్ లో రెండు పాటలు, ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకునే ఓ న్యూస్ ని తెలియజేసింది. అదే తెలుగువారంతా బాగా గ్రాండ్ గా జరుపుకునే వినాయక చవితి కానుకగా అనగా సెప్టెంబర్ 17న డిక్టేటర్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తుండడం.
వినాయక చవితికి పండుగ కానుకగా అభిమానులకు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని బాలయ్య అండ్ టీం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక్క టీజర్ మాత్రమే కాకుండా ‘డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ మీద వచ్చే ‘గణేశా’ అనే ఇంట్రడక్షన్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ పాట వినాయక చవితి బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసారు. అందుకే వినాయక చవితి రోజునే రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన వినాయక చవితి కానుకగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుని
విగ్రహం వద్ద ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ కి 4 నెలల ముందే సినిమాలోని ఫుల్ సాంగ్ ని రిలీజ్ చెయ్యడం ఇదే ప్రధమం.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.