‘హోరా హోరీ’కి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే..!

hora-hori
గతంలో అంతా కొత్తవాళ్ళతోనే సినిమాలు తీసి కూడా పలు బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు తేజ, మళ్ళీ ఆ ట్రెండ్‌లో అంతా కొత్తవాళ్ళతో రూపొందించిన సినిమా ‘హోరా హోరీ’. కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో దిలీప్-దక్షలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈమధ్య కాలంలో తనదైన మార్క్ సినిమాతో మెప్పించడంలో విఫలమైన తేజ, ‘హోరా హోరీ’తో మళ్ళీ తన మార్క్ చూపెట్టనున్నారనే టాక్ ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ వినిపిస్తోంది.

ఇక అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఫైట్ వర్ లవ్ అంటూ తేజ స్టైల్ ప్రేమకథతో మనముందుకు రానున్న ఈ సినిమా విషయంలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో 80% పైగా సన్నివేశాలు వర్షం నేపథ్యంలో నడుస్తాయని తేజ తెలిపారు. ఈ నేపథ్యంలో నడిచే సినిమాలన్నీ కలర్‌ఫుల్‌గా, విజువల్‌గా చాలా అందంగా వచ్చాయని తేజ స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను విడుదల చేయనుండడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది.

Exit mobile version