ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా ‘శివమ్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి కిషోర్ నిర్మించిన ఈ హై వోల్టేజ్ లవ్‌స్టోరీ ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈమధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగానే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్ ట్రైలర్స్‌లో రామ్, రాశి ఖన్నాల కెమిస్ట్రీ మేజర్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది.
ముఖ్యంగా ‘అందమైన లోకం’ అంటూ వచ్చే సాంగ్ ట్రైలర్లో లొకేషన్స్‌తో పాటు రామ్, రాశిల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు యూత్‌ను కట్టిపడేస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది. హీరో క్యారెక్టరైజేషన్‌ను హైలైట్‌గా చేసుకొని రూపొందిన ఈ సినిమా రామ్ కెరీర్లో మరో హిట్ తెచ్చిపెడుతుందన్న అభిప్రాయం ట్రైలర్ రిలీజ్ దగ్గర్నుంచీ వినబడుతోంది. ఇక హీరో రామ్ కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పండగ చేస్కోతో ఈమధ్యే అందుకున్న హిట్‌కు ఇది కొనసాగింపుగా మరో హిట్ అవుతుందని రామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
