‘శంకరాభరణం’కు గుమ్మడికాయ కొట్టేశారు.!

nikhil
హ్యాట్రిక్ హిట్స్‌తో జోరుమీదున్న యువహీరో నిఖిల్, ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. తన గత మూడు సినిమాలనూ సరికొత్త కథాంశాలతో ఉండేలా చూసుకున్న ఈ యువహీరో, ‘శంకరాభరణం’ ద్వారా ఓ స్టైలిష్ క్రైమ్ కామెడీని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీహార్‌లోని పలు రియలిస్టిక్ లొకేషన్స్‌తో పాటు అమెరికా, హైద్రాబాద్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం నేటితో పూర్తయింది.

ఇక ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టి శంకరాభరణం యూనిట్ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమాలో నిఖిల్ ఓ ఎన్నారైగా కనిపించనుండగా, నిఖిల్ సరసన హీరోయిన్‌గా నందిత నటించారు. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. నిఖిల్ ట్రాక్ రికార్డ్, కోన వెంకట్ రచయితగా పనిచేయడమే కాక, స్వయంగా నిర్మించడం వంటివి ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీపావళి కానుకగా నవంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈనెల్లోనే ఆడియో రిలీజ్ కానుంది.

Exit mobile version