మన తెలుగు సినిమా దగ్గర కెరీర్ ఆరంభం చేసిన ఆనతి కాలంలోనే సాలిడ్ స్టార్డం అందుకున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. అయితే తన గ్లామరస్ షో ఇంకా నటనతో దక్షిణాది సినిమా దగ్గర మెయిన్ గా తెలుగు సినిమాలో స్టార్ గా నిలిచిన ఆమె కొన్నాళ్ల కితం తనకి లైఫ్ ఇచ్చిన సౌత్ సినిమాపైనే షాకింగ్ కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత మెల్లగా సౌత్ లో దాదాపు పూజా కనుమరుగు కూడా అయ్యింది.
కానీ ఇప్పుడు కోలీవుడ్ లో ఆమె సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా ఆమె చేసిన తాజా సాంగ్ ‘తేరా హోం జౌన్’ అనే సినిమాలో పూజా హెగ్డే చేసిన గ్లామర్ షోపై విమర్శలు వస్తున్నాయి. సౌత్ సినిమా విషయంలో అన్ని కబుర్లు మాట్లాడి ఇప్పుడు బాలీవుడ్ సినిమాకి వెళ్లి అంతకు మించే తన స్కిన్ షో చేయడం లేదా అని దక్షిణాది సినిమా ప్రేమికులు ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై పూజా ఏమన్నా స్పందిస్తుందో లేక లైట్ తీసుకుంటుందో చూడాలి.
