మణిరత్నం మల్టీ స్టారర్ మూవీలో నాని.!

nani-mani-rathnam
సౌత్ సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులకు సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాలో నటించాలని, కనీసం ఓ చిన్న పాత్రలో అన్నా కనిపించాలని ఆశపడుతుంటారు. అలాంటి చాలా మంది స్టార్స్ లో టాలీవుడ్ యంగ్ హీరో నాని కూడా ఒకరు. ఇప్పటికే నాని చాలా సార్లు, మణిరత్నంతో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపాడు. మణిరత్నం గత కొద్ది రోజులగా దల్క్వేర్ సల్మాన్ – కార్తీలతో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. కానీ అది చివరి నిమిషంలో ఆగిపోవడంతో ఇప్పుడు అదే కథని తెలుగు – తమిళ భాషల్లో నిర్మించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఇది వరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం మణిరత్నం తన సినిమా కోసం నానిని ఒక హీరోగా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. మణిరత్నం సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న నాని కూడా స్టొరీ లైన్ విని వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూర్తి రివెంజ్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, కీర్తి సురేష్ లను హీరోయిన్స్ గా ఎంపిక చేసారు. కానీ వీరిద్దరిలో ఒకరు చేంజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్. ఈ ఏడాది మణిరత్నం నుంచి వచ్చిన హిట్ మూవీ ఓకే బంగారం సినిమాలో దల్క్వేర్ సల్మాన్ వాయిస్ కి నాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దాంతో ఇప్పటికే నాని – మణిరత్నం మధ్య మంచి రాపో ఉంది. మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Exit mobile version