దాదాపు 10 ఏళ్ళ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ ఇచ్చిన సినిమా ‘పటాస్’. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. తెలుగులో పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాని తమిళంలో, కన్నడంలో రీమేక్ చెయ్యడానికి ఇప్పటికే రైట్స్ తీసుకున్నారు. తమిళంలో ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ నిర్మాత ఆర్. బి చౌదరి దక్కించుకున్నాడు. కానీ గత కొద్ది రోజులుగా హీరో ఎవరనే విషయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
మొదటగా తమిళ రీమేక్ లో రంగం ఫేం జీవ హీరోగా నటిస్తాడు అన్నారు. అలాగే కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తాడు అన్నారు.. కానీ తాజా సమాచారం ప్రకారం అన్నీ మారిపోయాయి. రాఘవ లారెన్స్ ఈ సినిమాకి డైరెక్టర్ గా కాకుండా హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అనగా కళ్యాణ్ రామ్ చేసిన పోలీస్ పాత్రలో లారెన్స్ కనిపించనుంటే, శ్రీ రమణి ఈ సినిమాకి దర్శకత్వం చేయనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముని సీక్వెల్ లో బిజీగా ఉన్న లారెన్స్ డిసెంబర్ నుంచి ఈ రీమేక్ ని మొదలు పెట్టె పనిలో ఉన్నాడు.
