
తమిళంలో స్టార్ కమెడియన్గా వెలుగొందుతోన్న ప్రముఖ నటుడు వివేక్ ఈ ఉదయం పుత్రశోకంలో మునిగిపోయారు. వివేక్ కుమారుడు ప్రసన్న కుమార్ ఈ ఉదయం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. గత కొద్దికాలంగా బ్రెయిన్ ఫీవర్తో బాధపడుతోన్న ప్రసన్న కుమార్, చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నాడు. ఇక ఈ ఉదయం తీవ్రంగా మారడంతో తుదిశ్వాస విడిచాడు. 13 ఏళ్ళ వయసు గల ప్రసన్న కుమార్ గత కొన్నేళ్ళుగా సంగీతంపై ఆసక్తితో ఆ దిశగా సంగీతం నేర్చుకుంటూ వస్తున్నాడు.
ఇక వివేక్ కుమారుడు ప్రసన్న కుమార్ మృతి పట్ల తెలుగు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వివేక్ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కోరుతూ అభిమానులు ఉదయం నుంచి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో స్టార్ కమెడియన్ అయిన వివేక్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయన మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. ప్రసన్న కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని 123తెలుగు ప్రార్థిస్తోంది.