
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, తాజాగా విడుదలైన ‘కంచె’ సినిమాతో తానేంటో నిరూపించుకున్నారు. మొదటి సినిమా ముకుందాతోనే మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’తో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వరుణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తోన్న లోఫర్ సినిమా వరుణ్‌కు మంచి మాస్ ఇమేజ్ కూడా తెచ్చిపెట్టే సినిమాగా మొదట్నుంచీ ప్రచారం పొందుతూ వస్తోంది. ఆ నేపథ్యంలోనే నేడు విడుదలైన లోఫర్ ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
మదర్ సెంటిమెంట్‌ను మేజర్ హైలైట్‌గా చేసుకొని తెరకెక్కిన లోఫర్లో పూరీ వరుణ్‌కి ఓ మంచి మాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇక పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోఫర్ కూడా క్యారెక్టరైజేషన్లో కొత్తదనం చూపిస్తూ వరుణ్ తేజ్ హీరోగా మాస్ ఇమేజ్ కూడా తెచ్చిపెట్టేలా ఉండనుందని తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లోనూ వరుణ్ తేజ్ తన స్కిల్‌ను లోఫర్ ద్వారా బయటపెట్టనున్నారు. సి. కళ్యాణ్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దిశా పఠాని హీరోయిన్గా నటించింది. డిసెంబర్ నెలలోనే ఆడియో, సినిమాను విడుదల చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
‘లోఫర్’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి