‘చుట్టాలబ్బాయి’కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న ఆది

aadi-in-rough

‘ప్రేమ కావాలి’, లవ్లీ అంటూ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో హిట్స్ అందుకొని గాలిపటం లాంతో బోల్డ్ స్టోరీస్ ని కూడా తెలుగుకు పరిచయం చేసిన యంగ్ హీరో ఆది చేస్తున్న తదుపరి సినిమా ‘చుట్టాలబ్బాయి’. ‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ లాంటి కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకి డైరెక్టర్. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో ఆది సరసన ప్రణిత హీరోయిన్ ఆ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సీన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఫైనల్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అలాగే ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆది స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వెంకట్ నిర్మాణంలో రూపొందననున్న ఈ సినిమాని ఆది బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా వీరభద్రం చౌదరి కథని సిద్దం చేసాడట. కచ్చితంగా ఈ ‘చుట్టాలబ్బాయి’ సినిమాతో మంచి హిట్ అందుకుంటామని ఆది – వీరభద్రం చౌదరి భావిస్తున్నారు.

Exit mobile version