ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్ : అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా తారక్ ట్రీట్..?

NTRNeel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్-నీల్ నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో మే 20న ఈ మూవీ సాలిడ్ ట్రీట్ ఉంటుందని అందరూ రెడీ అవుతున్నారు.

అయితే, మే 20న కాకుండా మే 19న అర్ధరాత్రి కే ఈ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు నీల్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ సృష్టించిన ఈ కొత్త ప్రపంచం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మే 18న రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ సందడి ఉండగా, మరుసటి రోజే ఎన్టీఆర్ గ్లింప్స్ రానుండటంతో సోషల్ మీడియాలో మెగా-నందమూరి ఫ్యాన్స్ హడావిడి పీక్స్‌కు చేరింది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా తారక్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో వేచి చూడాలి.

Exit mobile version