తమిళ్ ని టార్గెట్ చేసిన అల్లు అర్జున్

allu-arjun
ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ అంతా తమ తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఇతర భాషల్లో కూడా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వారు తమిళంలో తమ సినిమాలను రిలీజ్ చేసారు. తమిళంలో మరింత మార్కెట్ పెంచుకోవడానికి మహేష్ బాబు ఇక నుంచి తన తదుపరి సినిమాలను తమిళంలో కూడా షూట్ చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. వీరి తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ తెలుగు మలయాళంతో పాటు తమిళంలో కోడా తన మార్కెట్ పెంచుకోవడానికి ఫిక్స్ అయ్యాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘సరైనోడు'(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘ఇష్క్’, ‘మనం’ సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. విక్రమ్ కుమార్ – అల్లు అర్జున్ లు ఈ సినిమాకి ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో నిర్మించాలనుకుంటున్నారు. రుద్రమదేవి తమిళ వెర్షన్ తో తమిళ ఆడియన్స్ కి పరిచయమైన అల్లు అర్జున్ ఈ సినిమాతో గ్రాండ్ గా తమిళ్లో లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నారు. అన్నీ ఓకే అయితే విక్రమ్ కుమార్ – అల్లు ర్జున్ మూవీ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుంది.

Exit mobile version