కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో లోకేష్ ‘DC’ ట్రైలర్.. ఎప్పుడంటే..?

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘DC’ గ్లోబల్ స్టేజ్ పై సందడి చేయబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 వేదికగా మే 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అరుదైన గౌరవం దక్కడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక వయలెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కీలక పాత్రలు పోషిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.

లోకేష్ డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటబోతుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version