
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందిన సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బెంగాల్ టైగర్‌ను రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ట్రైలర్ ఈమధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాను నవంబర్ చివరి వారంలో విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. కాగా అదే వారంలో రిలీజ్ అవుతున్న సైజ్ జీరో సినిమాకి సోలో రిలీజ్ ని ఇవ్వడం కోసం, అలాగే బెంగాల్ టైగర్ కూడా సోలోగా రిలీజ్ అవ్వాలని ఈ చిత్ర నిర్మాత రాధామోహన్ బెంగాల్ టైగర్ ని డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.