‘కుమారి 21F’కి రికార్డ్ స్థాయి రిలీజ్

Kumari21f
క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే చాలు ఆ సినిమా పెద్దదైనా, చిన్నదైనా ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఆ సినిమాకి బిజినెస్ కూడా బాగా అయిపోతుంది. అలా క్రేజీ కాంబినేషన్ లో ఈ వారం వస్తున్న సినిమా ‘కుమారి 21F’. తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరైన సుకుమార్ ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా చేయడం వలన ఈ సినిమాకి మరికొంత క్రేజ్ నెలకొంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో పాటు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ భారీగా చేయడం వలన సినిమాకి బ్జిన్స్ కూడా బాగా అయ్యింది. దాంతో ఈ సినిమా ఓవరాల్ గా రాజ్ తరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది. కేవలం ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా, యుఎస్, యుకెలలో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేసారు. సినిమా రిలీజ్ కి ముందే ఇంత పాజిటి రెస్పాన్స్ రావడం సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ తెప్పిస్తుందని ఈ చిత్ర ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హేభ పటేల్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. టాప్ టెక్నీషియన్స్ అయిన రత్నవేలు, దేవీశ్రీ ప్రసాద్ లు కూడా ఈ సినిమాకి పనిచేసారు.

Exit mobile version