
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ తన అభిమానులని ఎంటర్టైన్ చేయడం కోసం 2012లో సూపర్ హిట్ అయిన ‘గబ్బర్ సింగ్’ పాత్రని మళ్ళీ తెరపైకి తీసుకురానున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ స్మాల్ షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఓ మేజర్ షెడ్యూల్ కోసం ఈ నెల 17న గుజరాత్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్ర టీం బడోరలో పవన్ కళ్యాణ్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా షూట్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ చిత్ర టీంతో జాయిన్ కానుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ జరిగిన జాప్యం ఇకపై జరగకూడదని శరవేగంగా షూటింగ్ ని ఫాస్ట్ ఫాస్ట్ గా ఫినిష్ చేసి, సమ్మర్ కానుకగా సినిమాని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ ఓ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించనుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.