సూపర్‌స్టార్ రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రం విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను తొలుత ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఆగస్టు 15న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలయ్యే అవకాశం ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద భారీ పోటీని నివారించేందుకు ‘జైలర్ 2’ బృందం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఇతర భాషా చిత్రాలు కూడా క్యూ కట్టడంతో, రజినీకాంత్ సినిమాకు సోలో రిలీజ్ దక్కడం కష్టమని భావించి మేకర్స్ తమ ప్లాన్ మార్చుకున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్ పిక్చర్స్ యోచిస్తోంది. అన్ని భాషల్లోనూ మంచి థియేటర్లు దొరకడమే కాకుండా, లాంగ్ రన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. రమ్యకృష్ణ, యోగి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
