బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇటీవల ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ సౌత్ బ్యూటీ తన తొలి చిత్రంతో ఫ్లాప్ మూటగట్టుకుంది.
ఇక ‘ఏక్ దిన్’ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్కు మంచి మార్కులే పడ్డా, ఆమె డబ్బింగ్‌కు మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘రామాయణ’ చిత్రంలో ఆమె పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆమె హిందీ ఉచ్చారణలో దక్షిణాది యాస ఎక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. రామాయణం వంటి పౌరాణిక చిత్రానికి స్పష్టమైన, గ్రాంధిక హిందీ అవసరం కాబట్టి, యాస వల్ల పాత్ర గాంభీర్యం దెబ్బతినకూడదని చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకునే సాయి పల్లవికి ఇది షాకింగ్ విషయమే. అయితే, సినిమాను పాన్ ఇండియా స్థాయిలో పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ రిస్క్ తీసుకోవడం లేదని టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
