
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటిసినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ తన కొత్త సినిమాను ఇంకా మొదలుపెట్టని శ్రీనివాస్, ఈ మధ్యే ఆ విషయమై ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ‘జ్యో అచ్యుతానంద’ పేరుతో హీరో నారా రోహిత్‌తో తన కొత్త సినిమా ఉంటుందని, ఓ మంచి ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనుందని తెలియజేశారు.
ఇక తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మరో యువ హీరోను ఎంపిక చేయడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోగా పరిచయమైన నాగ శౌర్య, నారా రోహిత్ జ్యో అచుతానందలో నారా రోహిత్‌కి తమ్ముడిగా కనిపించనున్నారు. కథ రీత్యా ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, ఆ నేపథ్యంలోనే ఈ పాత్ర కోసం నాగ శౌర్యను సంప్రదించామని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. వారాహి చలనచిత్రం నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ను కూడా ఫైనల్ చేస్తాం అని అవసరాల శ్రీనివాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.