
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’, రామ్ ‘ఒంగోలు గిత్త’ సినిమాలలో క్యూట్ హీరోయిన్ గా కనిపించి ప్రేక్షకులను ఆకర్షించిన హీరోయిన్ కృతి కర్భంద. ఇటీవలే ఈ భామ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో చరణ్ కి సిస్టర్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈ భామకి ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదే బాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ సీరీస్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం.
బాలీవుడ్ ముద్దుల వీరుడుగా పేరొందిన ఇమ్రాన్ హస్మీ కెరీర్లో హిట్స్ హా నిలిచినా సీరీస్ రాజ్.. హర్రర్ థ్రిల్లర్ గా వచ్చే ఈ రాజ్ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకూ 3 పార్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇమ్రాన్ హస్మీ టీం రాజ్ 4 కి కథని సిద్దం చేసారు. అలాగే ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మీకి జోడీగా కృతి కర్భందని ఫైనల్ చేసారు. ట్రై యాంగిల్ లవ్ స్టొరీతో రూపొందనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా గౌరవ అరోరాని ఫైనల్ చేసారు. ఇమ్రాన్ హస్మీ అంటే లిప్ కిస్ ఉండాల్సిందే ఈ లెక్కన ఇందులో కృతి కర్భంద కూడా కో ఇమ్రాన్ హస్మీతో లిప్ కిస్ లాగించేయనుంది. ముఖేష్ భట్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది, వచ్చే ఏడాది జూలైలో సినిమా రిలీజ్ కానుంది.