5 హీరోలతో కృష్ణవంశీ-దిల్ రాజు మూవీ.!!

Krishna-Vamsi-Dil-Raju
రొటీన్ కి భిన్నంగా ఉండే కథలని కమర్షియల్ యాన్గిలో చెప్పడానికి ట్రై చేయడమే కాకుండా గులాబి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం, మురారి లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాడు. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ మొదటిసారి తను ఇప్పటి వరకూ చేయని ఓ హర్రర్ కథాంశంతో తన తదుపరి సినిమా స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నాడు.

ఈ హర్రర్ సినిమా కథకి ‘రుద్రాక్ష’ నే టైటిల్ ఐ కూడా అనుకుంటున్నారని ఇదివరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో 5 మంచి హీరోలు ఉంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వారు పెద్ద హీరోలా లేక చిన్న హీరోలా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాలో ఈ 5 పాత్రలకి ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే 5 మంది హీరోస్ ని చూస్తున్నారని సమాచారం. ఈ హర్రర్ సినిమాని నటుడు ప్రకాష్ రాజ్ – దిల్ రాజు కలిసి నిర్మించడానికి సిద్దమయ్యారు. ఇటీవలే కృష్ణవంశీ ఫైనల్ నేరేషన్ ని దిల్ రాజుకి వినిపించగా, దిల్ రాజు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేసారు.

Exit mobile version