
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఇలా ఒకదానితో ఒకటి సంబధం లేకుండా సినిమాలు చేసి తనకు సినిమాలపై ఉన్న ఫాషన్ ను చూపించిన దర్శకుడు క్రిష్. ఇటీవలే క్రిష్ చేసిన నాల్గవ సినిమా ‘కంచె’ రిలీజ్ అయ్యి తెలుగు ఆడియన్స్ ని షాక్ కి గురి చేసింది. దానికి కారణం రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని చేయడమే. చూసిన ప్రతి ఒక్కరూ వరల్డ్ వార్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ తరహాలో చిత్రీకరించారని క్రిష్ ని తెగ మెచ్చుకున్నారు.
ఈ కంచె సినిమా విమర్శకులతో పాటు, బాక్స్ ఆఫీసు వద్ద కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ప్రస్తుతం క్రిష్ తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు ఈ సారి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టగానే తన సినిమాకి కావాల్సిన టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లున్నాడు క్రిష్. ఎందుకంటే రీసెంట్ గా క్రిష్ తన హోం బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేమ్స్ బ్యానర్ పై ‘రాయబారి’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేసాడు. పూర్తి కథని సిద్డంక్ హేసాకే క్రిష్ తన సినిమా కథకి పర్ఫెక్ట్ గా సరిపోయే హీరోని సెలక్ట్ చేసుకుంటాడు. ప్రస్తుతం క్రిష్ కి అయితే మెగా ఫ్యామిలీ నుంచి, అక్కినేని ఫ్యామిలీ నుంచి పిలుపు వచ్చింది. మరి ఆ ఇరు ఫ్యామిలీలలో ఏ హీరో క్రిష్ ‘రాయబారి’గా మారతాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..