రాజ్ తరుణ్ కోసం మరోసారి కుమారినే అంట?

kumari-21-f
సినిమా సినిమాకి కొత్తదనంతో పాటు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరోస్ లో మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు ముందంజలో ఉన్నారు. మంచు విష్ణు ప్రస్తుతం ‘సరదా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే రాజ్ తరుణ్ వర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు అవ్వగానే వీరిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారని ఇదివరకే తెలియజేశాం. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది.

ఇటీవలే ఈ సినిమాలో మంచు విష్ణుకి జోడీగా అనేగన్(అనేకుడు) సినిమాతో తమిళ చిత్ర సీమకు పరిచయమైన బాలీవుడ్ హాట్ భామ అమర్య దస్తూర్ ని సెలక్ట్ చేసారని తెలిపాము. గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ కోసం అవిక గోర్ ని ఫైనలైజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్ర టీం అవిక గోర్ ని పక్కన పెట్టి కుమారి 21F తో క్రేజ్ క్రియేట్ చేసుకున్న హేభ పటేల్ ని సెలక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలా అయితే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోందట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా పంజాబీ కామెడీ ఫిల్మ్ కి రీమేక్. జనవరి చివరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version