పవర్ఫుల్ ఇంటర్వల్ బ్లాక్ రెడీ చేసిన బన్ని

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సరైనోడు'(వర్కింగ్ టైటిల్). ఇటీవలే ఈ చిత్ర టీం ఓ మెయిన్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళారు. ఆ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం మళ్ళీ హైదరబాద్ చేరుకున్నారు. గత రెండు రోజులుగా అల్లు అర్జున్ పై ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. హైదరాబాద్ నగర శివార్లలో ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఓ స్పెషల్ సెట్ ని వేసారు. అక్కడ సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమా ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు.

హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లతో పాటు శ్రీకాంత్ కూడా పాల్గొన్న ఈ యాక్షన్ ఎపిసోడ్ కి రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ స్టంట్స్ కంపోజ్ చేసారు. యాక్షన్ ఎపిసోడ్స్ కి అధిక ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాకి ముగ్గురు డిఫరెంట్ యాక్షన్ కంపోజర్స్ పనిచేస్తున్నారు. వారే రవివర్మ, రామ్-లక్ష్మణ్, కీచ. ఇంటర్వల్ బ్లాక్ మొత్తం పూర్తయిన తర్వాత కీచ నేతృత్వంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేయనున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. సమ్మర్ ఫస్ట్ రిలీజ్ గా ఏప్రిల్ మొదట్లో సరైనోడు సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version