ఇంటర్వ్యూ : భీమ్స్ సెసిరోలియో – నా కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చే సినిమా ‘బెంగాల్ టైగర్’

Bheems-Ceciroleo
ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల టాలెంట్ ని నిరూపించుకుంటూ వస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో. భీమ్స్ తన కెరీర్లో చేసిన మొదటి బిగ్ బడ్జెట్ మూవీ ‘బెంగాల్ టైగర్’. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భీమ్స్ తో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) అసలు ‘బెంగాల్ టైగర్’ ఆఫర్ ఎలా వచ్చింది?
స) నేను సంపత్ నంది చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్. గతంలో కూడా తనకి సంబదించిన పలు సినిమాల్లో వర్క్ చేసాను. రవితేజతో ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వగానే సంపత్ నంది నాకు పలు సందర్భాలు ఇచ్చి కొన్ని ట్యూన్స్ రెడీ చేయమన్నాడు. మేమిద్దరం కలిసి ఆ ట్యూన్స్ ని రవితేజ దగ్గరికి తీసుకెళ్ళాం. రవితేజ గారు ఆ ట్యూన్స్ విని అక్కడే నన్ను మెచ్చుకొని, ట్యూన్స్ ఓకే చెయ్యడమే కాకుండా ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చెయ్యాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు.

ప్రశ్న) మీ కెరీర్లో మొదటిసారి బిగ్ బడ్జెట్ కమర్షియల్ ఫిల్మ్ కి పనిచేయడం ఎలా ఆనిపించింది?
స) నా కెరీర్లో ఈ సినిమాకి పనిచేసిన సమయం చాలా మెమొరబుల్, ఎందుకంటే ఈ జర్నీలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సాంగ్స్ కంపోజ్ చేసే టైంలో రవితేజ గారు చాలా సలహాలు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసారు. అలాగే పాటలు ఓకే అన్నాక సింగర్స్ సెలక్షన్ లో నాకు ఫ్రీడం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ మరియు డైరెక్టర్ సంపత్ నందిలకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. వాళ్ళందరి హెల్ప్ లేకపోతే ఈ బెంగాల్ టైగర్ ఆల్బమ్ ఇంత బాగా వచ్చేది కాదు.

ప్రశ్న) మీరు గత సినిమాల్లో చేసిన పాటలు బాగానే ఫేమస్ కానీ మీరెందుకు బయట కనిపించడంలేదు?
స) మన సెల్ఫ్ ప్రమోషన్స్ కంటే మనం చేసిన పనే మాట్లాడాలి అనుకునే మనస్తత్వం నాది. మీ మ్యూజిక్ నచ్చి, రెగ్యులర్ గా వింటూ ఉంటే ఆడియన్స్ కి మీ పేరు అలా గుర్తుండి పోతుంది. ఎప్పుడైతే ఆడియన్స్ మన వర్క్ ని మెచ్చుకోవడం మొదలు పెడతారో అదే మనకు బిగ్గెస్ట్ గిఫ్ట్ అని ఫీలవుతాను.

ప్రశ్న) ఈ ఆల్బమ్ లో చెప్పుకోదగిన స్పెషల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి?
స) బెంగాల్ టైగర్ సాంగ్స్ కి అందరి నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది, ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఇక స్పెషల్ ఎలిమెంట్స్ అంటే, బాంచన్ సాంగ్ లో తెలుగు రాప్ ట్రై చేసాం, తెలుగు సాంగ్స్ లో అలా ట్రై చేయడం చాలా కొత్త అని చెప్పాలి. అలాగే రొమాంటిక్ సాంగ్ కూడా కొత్తగా ట్రై చేసాం, అది అందరికీ బాగా నచ్చింది. బెంగాల్ టైగర్ అనే సినిమా నా కెరీర్ ని మరో స్టేజ్ కి తీసుకెళ్తుందని భావిస్తున్నాను.

ప్రశ్న) ఎక్కువగా మీ మ్యూజిక్ లో ఫోక్ ఫ్లేవర్ కనబడుతూ ఉంటుంది. దానికి గల కారణం?
స) నేను రూరల్ ఏరియా నుంచి వచ్చాను, అందుకే నా మ్యూజిక్ లో అనుకోకుండానే ఆ ఫ్లేవర్ మిక్స్ అవుతూ ఉండచ్చు. ఇప్పుడిప్పుడే నేను ఆ ఫ్లేవర్ నుంచి కొద్ది కొద్దిగా బయటకి వస్తున్నాను. చెప్పాలంటే బెంగాల్ టైగర్ లో ఆ ఫ్లేవర్ లేకుండా చాలా కొత్త ట్యూన్స్ ట్రై చేసాను.

ప్రశ్న) సంగీతంలో మీకు స్పూర్తినిచ్చే సంగీత దర్శకులు ఎవరు?
స) నేను మణిశర్మగారికి ప్పెద్ద ఫ్యాన్, ఆయన ప్రభావం నా మీద కాస్త ఉంటుంది. అలాగే హారీష్ జైరాజ్ మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం.

ప్రశ్న) మీరు కమిట్ అయిన తదుపరి సినిమాల గురించి చెప్పండి?
స) ప్రస్తుతం వరుసగా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నేను ఇంకా ఏదీ కమిట్ అవ్వలేదు. ఈ ఆఫర్స్ లో నా కెరీర్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళే సినిమాని సెలక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను.

Exit mobile version