స్టార్ హీరోస్ తో ఢీ కొట్టేందుకు సిద్దమైన యంగ్ హీరో

Express-Raja
కెరీర్ మొదట్లో ప్రయోగాత్మక సినిమాలు చేసి ఆ తర్వాత విభిన్న తరహా కథలనే ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యేలా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో శర్వానంద్. అలా ట్రై చేసిన ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి శర్వానంద్ కి మంచి బూస్టప్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత శర్వానంద్ చేసిన డిఫరెంట్ ఫిల్మ్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’. తెలుగులో పుష్కరానికి ఓ సారి కనపడే రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ‘ఎక్స్ ప్రెస్ రాజా’ని జనవరి సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ భాగం సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేసారట. అప్పుడైతే హాలిడేస్ వలన ఓపెనింగ్స్ బాగా వస్తాయని ఈ చిత్ర టీం ఆశిస్తోందట. ఫైనల్ గా ఈ చిత్ర టీం ఇదే సీజన్ కి ఫిక్స్ అయ్యి డేట్ ని ఫిక్స్ చేస్తే మాత్రం శర్వానంద్ ఓ ముగ్గురు స్టార్ హీరోస్ తో పోటీపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా, ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనౌన్స్ చేసి ఉన్నారు.

మరి శర్వానంద్ కూడా ఇదే సీజన్ లో వస్తాడేమో చూడాలి. శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని సూపర్ హిట్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Exit mobile version