
ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విలయం సంభవించినా, ఎప్పుడు ప్రజలకి ఇబ్బంది కలిగినా ప్రజలకి సాయం చేయడానికి మేమున్నాం అంటూ తెలుగు చిత్ర సీమలోని స్టార్స్ ముందుకు వచ్చి సపోర్ట్ ఇస్తారు. చెన్నై నగరాన్ని గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్థంబించిన నేపథ్యంలో వారికోసం మన తెలుగు స్టార్స్ సైతం చేయూతని అందించడం కోసం ‘మన మద్రాస్ కోసం’ అనే ఈవెంట్ ని స్టార్ట్ చేసారు.
అందులో భాగంగానే నిన్న స్టార్స్ అయిన రానా, అల్లరి నరేష్, నిఖిల్, కాజల్ గర్వాల్, లక్ష్మీ మంచు, తేజశ్వి మదివాడ, మధురిమలు హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ మన మద్రాస్ కోసం ఈ వెంట కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అక్కడికి వచ్చిన వారితో స్టార్స్ మాట్లాడటమే కాకుండా అందరికీ ఆతోగ్రాఫ్స్ సేల్ఫీస్ కూడా ఇచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట మొదలైంది. అలాగే ఈ తొక్కిసలాట వలన నటీనటులు కూడా కాస్త ఇబ్బంది ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సమస్య రావడంతో మరో రెండు మాల్స్ లో నిర్వహించాల్సిన ప్రోగ్రామ్స్ ని కాన్సల్ చేసారు.