
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన రానా, త్వరలో ‘ఘాజీ’ పేరుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పీవీపీ సినిమా ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించనున్న ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. నావికా దళ యుద్ధం నేపథ్యంలో మొట్టమొదటి సినిమాగా తెరకెక్కనుందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమా 1971వ సంవత్సరంలో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం కథాంశంగా రూపొందనుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మొదటి ఘాజీ టీమ్ ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేసింది. అయితే తాను ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు, దర్శకత్వం వహిస్తున్న సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ రోల్ కోసం మరో ఆర్టిస్ట్ కోసం వెతికిన పీవీపీ టీమ్ తాజాగా రావు రమేష్‌ను ఎంపిక చేసింది. గత కొద్దికాలంగా తెలుగులో మంచి పాత్రలతో తనదైన మార్క్ సెట్ చేసిన రావు రమేష్ చేయబోయే పాత్ర సినిమాకు ప్రధాన పాత్రల్లో ఒకటిగా చెప్పబడుతోంది.