బాలయ్య సినిమాలో బాలీవుడ్ హీరో

Dictator
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్. ప్రసతుతం ఈ సినిమ షూటింగ్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 20న ఆడియో రిలీజ్ చేసి, సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా వర్క్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర డైరెక్టర్ శ్రీవాస్ ని కలిసారు.

కలిసి వారు డిక్టేటర్ స్టొరీని విన్నారు, వారికి ఈ హ బాగా నచ్చడం మరియు బాలీవుడ్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఉండడంతో వెంటనే రీమేక్ చేయడానికి సిద్దమైపోయారు. అంతే కాకుండా తెలుగు వెర్షన్ కి డైరెక్ట్ చేస్తున్న శ్రీవాస్ నే హిందీ రీమేక్ వెర్షన్ కి కూడా డైరెక్ట్ చేయమని అడిగారు. అలాగే బాలయ్య చేసిన పాత్ర కోసం అజయ్ దేవగన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అజయ్ దేవగన్ ప్రస్తుతం శివాయ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తోంది.ర రిలీజ్ కి ముందే ఇలా ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డిక్టేటర్ కథ విని రీమేక్ చెయ్యడానికి సిద్దమవడం వలన సినిమాపై అంచనాలు పెరిగాయి, అలాగే తెలుగులో సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఫీలవుతున్నారు.

Exit mobile version